హైదరాబాద్ లో చేనేత కార్మికుల సమస్యలపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను పలువురు జనగాం జిల్లాకు చెందిన చేనేత సంఘాల నాయకులు కలిసారు. గురువారం శ్రీ పద్మవంశీ చేనేత సహకార సంఘం జనగాం జిల్లా ఎల్లంల ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యేను కల్సి చేనేత కార్మికుల సమస్యలను, జీవన పరిస్థితిలను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే చేనేత కార్మికుల సమస్యలు నాకు తెలుసునని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు.