కుటుంబ నియంత్రణకు జిల్లాలో ఉత్తమ సేవలందించిన డాక్టర్లను శుక్రవారం సిబ్బందిని జనగామ జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డిఎంహెచ్ఓ మల్లికార్జునరావు సన్మానించారు. ఒక పాపతో కుటుంబ నియంత్రణకు కృషి చేసిన కొండ పద్మను ఆదర్శ కుటుంబంగా గుర్తించి, అత్యధికంగా 700 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ శకుంతల, మోటివేషన్ పర్సన్ దీపారాణి, ఉత్తమ సేవలందించిన దేవరుప్పల మండల పిహెచ్సి కి చెందిన ఆశా కార్యకర్త స్వప్నను ఘనంగా సన్మానించారు.