జనగామ జిల్లా బచ్చన్నపేటలో మంజూరైన మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలను అక్కడే శాశ్వతంగా ఏర్పాటు చేయాలని క్లీన్ ఫ్యూచర్ సొసైటీ అధ్యక్షుడు గంగరబోయిన మహెందర్, కమిటీ సభ్యులు మంత్రులు, అధికారులకు వినతి ఆదివారం అందజేశారు. ఆరు సంవత్సరాలుగా తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి భవనాలు నిర్మించాలని కోరారు. ఈ వినతి ఉమ్మడి వరంగల్ జిల్లా, జనగాం పరిధిలోని బచ్చన్నపేటలో జరిగింది.