జనగామలో ఇంటర్ ప్రాక్టికల్స్ పై సమీక్ష

జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కే. జితేందర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జనగామలో ప్రాక్టికల్స్ కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం జరిగింది. 2026 ఇంటర్ ప్రాక్టికల్స్ కోసం జిల్లాలో 11 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఉదయం 9, మధ్యాహ్నం 2 గంటలకు రెండు బ్యాచ్‌లలో పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,819 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్