పెంబర్తిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

జనగామ జిల్లా పెంబర్తి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన అజ్మీర గణేష్ (21) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్