సిరిపురంలో పులి భయం గ్రామాల్లో డప్పు చాటింపు

జనగామ జిల్లా లింగాలగణపురం మండలం సిరిపురం పరిసరాల్లో పెద్ద పులి సంచరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో బుధవారం గ్రామాల్లో డప్పు చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. పొలం పనులకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. పులి ఆనవాళ్లు లేదా పాదముద్రలు కనిపిస్తే వెంటనే స్థానిక ఎస్సైకి సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్