ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మెన్ గుడిమాళ్ళ రవికుమార్ ఆదేశాను సరం జనగామ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి హన్మకొండ అదాలత్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద లక్ష్మణ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కొవొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడింది.