విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఛైర్మన్ గా విజయ

జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఛైర్మన్ గా లింగాల విజయ, డైరెక్టర్లుగా పాతూరి లలిత, లింగాల పద్మ, ఏలూరు లలిత, రమాదేవి, మమత, సుగుణ, పాకనాటి జ్యోతి, శాతెల్లి మణెమ్మ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఛైర్మన్ విజయ మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి, రైతులకు అందాల్సిన సబ్సిడీల విషయంలో తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్