మహబూబాబాద్: విషాదం.. వాగులో పడి వ్యక్తి మృతి

బయ్యారం మండలంలోని అలిగేటి వాగులో ప్రమాదవశాత్తు పడి గొర్ల కాపరి రాములు (55) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం గొర్లను మద్ది చెట్టు మడుగు వద్ద వాగు దాటించే క్రమంలో నీటిలోకి దిగిన రాములు, గొర్లతో పాటు ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం అటుగా వెళ్లిన రైతులు గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్