మైనారిటీ గురుకులాల్లో వంద శాతం ఉత్తీర్ణత

మహబూబాబాద్ జిల్లాలోని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలు పదో తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయని జిల్లా అధికారి బి. శ్రీనివాసరావు తెలిపారు. మహబూబాబాద్ బాలుర పాఠశాల విద్యార్థి ఎస్. కె. షఫీ 578 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. తొర్రూరుకు చెందిన అక్షయ 564, డోర్నకల్ విద్యార్థిని సమ్రీన్ 536 మార్కులు సాధించారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యకు ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్