ఏకత స్ఫూర్తిని నింపేందుకు నేడు 2కె రన్: జిల్లా ఎస్పీ

సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం 2కె రన్ నిర్వహించనున్నట్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. పట్టణంలోని నెహ్రూ సెంటర్ నుంచి అండర్ బ్రిడ్జి మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఈ పరుగు జరుగుతుంది. జిల్లాలోని యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యత పరుగును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్