మహబూబాబాద్ జిల్లాలో 77వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగిలి ముఖేష్ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయవాద విద్యార్థి సంఘమని, విద్యార్థుల శ్రేయస్సు కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విద్యా సమస్యలపై పోరాడుతోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రక్తదానాలతో పాల్గొన్న ఏబీవీపీ, విద్యార్థుల్లో దేశభక్తి నింపేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు.