మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నేలవంచలో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి స్వర్ణ విజయచంద్ర రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏవో అబ్దుల్ మాలిక్ ఆధ్వర్యంలో వరి కొయ్యలు కాల్చడం వల్ల కలిగే నష్టాలు, నానో యూరియా వాడకం వల్ల లాభాలపై రైతులకు వివరించారు. లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని, పంట మార్పిడి చేయాలని సూచించారు.