విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను జిల్లా డీఎస్పీ కన్వీనర్ రాంపాక సుధాకర్, ఎంజేఎస్ జిల్లా అధ్యక్షులు ఐపాక వెంకన్న, మర్యాదపూర్వంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో చదివే విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా విద్యార్థులను అనుమతించడం లేదని, విద్యార్థుల పేరెంట్స్ ఫీజులు చెల్లించేలా లెటర్ రాసిస్తే అనుమతిస్తామని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సమస్యలపై తక్షణమే స్పందించి, విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజులు చెల్లించుకునే స్కూల్స్ పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.