మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గువ్వలబోడు వద్ద శుక్రవారం నర్సంపేట నుండి గంగారం కు బార్దాన్ (గన్నీ బ్యాగులు) లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అటవీ ప్రాంతంలో ఎగసిన మంటలు గాలికి గన్నీ సంచులపై పడడంతో అగ్నికి ఆహుతైంది. మంటలు చెలరేగడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడి పూర్తిగా కాలిపోయింది. వాహనం నడుపుతున్న డ్రైవర్ సుధాకర్ కు తీవ్ర గాయాలవడంతో అతన్ని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.