మహబూబాబాద్ జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం గేటుని ఢీకొన్న కారు

మహబూబాబాద్ పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయం గేట్ ను బుధవారం రాత్రి కారు ఢీకొంది. మహబూబాబాద్ పట్టణంలో అతి వేగంతో పలువురిని ఢీకొంటూ అదుపు తప్పి ఎస్పీ క్యాంపు కార్యాలయం గేటుని ఢీకొని నిలిచిపోయింది. దీంతో పోలీసులు
ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కారు దిగి మరికొందరు పారిపోయారని తెలిసింది. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా మరేదైన కారణమా అని విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్