మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు (మ) ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన బిస్సు రమేష్ అనే వ్యక్తి బుధవారం చిన్నగూడూరు పోలీస్ స్టేషన్ ముందు కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టారు. దసరా పండుగ నాడు దాసరి యాకన్న, వెంకన్న అనే వ్యక్తులు తనపై కత్తితో దాడి చేసారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు అంటూ పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని నిరసన తెలిపారు.