మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్ కుమార్తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన వినతులను పరిశీలించి, సంబంధిత అధికారులు వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.