కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం: ఎమ్మెల్యే

మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పని చేసే ప్రభుత్వమని అభివర్ణించారు. శనివారం నెల్లికుదురు మండలంలోని రావిరాల, రాజుల కొత్తపల్లి గ్రామాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెరువు కట్టల నిర్మాణాలలో నాణ్యత పాటించాలని, లేనిపక్షంలో అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్