మహబూబాబాద్: బీసీల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుంది: సత్యవతి

మహబూబాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ క్యాబినెట్ మీటింగ్ నే సంబురాలు చేసుకున్న కాంగ్రెస్ బీసీలను మరోసారి మోసం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ పేరుతో డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్