పాకాల వాగులో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.. మాజీ ఎంపీ

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గోవిందాపురం, లక్ష్మీపురం, దుబ్బగూడెం, కట్టుగూడెం, రెడ్యాల గ్రామాల్లో పాకాల వాగు పరివాహక ప్రాంతాల్లో సాగు నీటి కొరత తీవ్రంగా ఉంది. నీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయగా, భారాస జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ కవిత మాలోత్ స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పాకాల వాగు ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్