దంతాలపల్లి మండల కేంద్రంలోని ఓ విద్యార్థి గురుకులం నుంచి తప్పించుకున్న ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం దంతాలపల్లి మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన పస్తం మంజు అనే విద్యార్థి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులంలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లాడు. పాఠశాల నుంచి విద్యార్థి పారిపోవడం పట్ల ఉపాధ్యాయుల నిర్లక్ష్యాన్ని గుర్తించి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.