మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలోని తులసి తండా, రేకుల తండా, నారాయణపురం గ్రామాల్లో రైతులు పండించిన మొక్కజొన్నను ప్రభుత్వం కొనడం లేదని, పట్టా పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రత్యేక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, మొక్కజొన్నను కొనుగోలు చేయాలని, పట్టా పాస్ పుస్తకాలు లేని రైతులకు కూడా ఎన్డీఎస్ ప్రకారం కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. దళారుల చేతిలో మోసపోతున్నామని రైతులు వాపోతున్నారు.