100 మంది మహిళలకు వేం చిత్రంతో కూడిన మంగళహారతుల ప్లేట్ల పంపిణి

కేసముద్రం మండలం అర్పణపల్లిలో రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమార్చన జరిగింది. ఈ సందర్భంగా కేసముద్రం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్, వేం చిత్రంతో కూడిన మంగళహారతుల ప్లేట్లను వందమంది ఆడబిడ్డలకు బహూకరించారు. యువత ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాక్ స్టార్ యూత్ అధ్యక్షుడు సింగని ప్రశాంత్, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕