ప్రతి ఒక్కరూ భక్తి భావనను పెంపొందించుకోవాలి: ఝాన్సీ రెడ్డి

ప్రతి ఒక్కరూ భక్తి భావనను పెంపొందించుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం  
ఇన్ ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని కంటాయపాలెం రోడ్డు పాటిమీద ఆలయ పున: నిర్మాణ దాతలు పత్తి చిలకమ్మ సమ్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాలయ ఆలయం పునః ప్రతిష్టాపన మహోత్సవాన్ని ప్రారంభించారు. భక్తిశ్రద్ధలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పవిత్రమైన శివాలయం పునః ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం ఆనందదాయకమన్నారు.

సంబంధిత పోస్ట్