రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వరద నీరు

మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా పట్టణంలోని అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు నిలిచిపోయింది. ఈ వరద నీటిలో ఆటోలు చిక్కుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అండర్ బ్రిడ్జి వద్ద సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. నీరు నిల్వ ఉండకుండా వెళ్లేలా మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గం సిబ్బంది వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్