మహబూబాబాద్ మున్సిపాలిటీ 26వ వార్డులో శ్రీ విఘ్నజిత్ యువసేన గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు, మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత, మలోత్ హరిత, కటికనేని నిహాల్ కృష్ణ సోమవారం మట్టి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో పాటు 36వ వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్న, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యులు మహబూబ్ పాషా, మాజీ సర్పంచ్ నల్లని నవీన్ రావు, పెద్దమాముల అంజి, కమిటీ సభ్యులు సాయి, శ్రీకాంత్, క్రాంతి, ప్రతాప్, రాజేష్, అరవింద్, లక్ష్మణ్, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.