మహబూబాబాద్‌లో మాజీ సర్పంచ్ యాకయ్య దారుణ హత్య

మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి మాజీ సర్పంచ్ యాకయ్య గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. సింగారం గ్రామానికి చెందిన యాకయ్యపై మారణాయుధాలతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రూరల్ సీఐ అంజలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్