గూడూరు: బైక్ ను ఢీకొట్టిన కారు తీవ్ర గాయాలు

మహబూబాబాద్ జిల్లా గూడురు మండలంలోని కొల్లాపురం గ్రామానికి చెందిన చలమల్ల వెంకటేశ్వర్లు, మేస్త్రీ పని ముగించుకొని శనివారం బైక్‌పై వెళ్తుండగా, విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన వెంకటేశ్వర్లును గూడూరు సీహెచ్‌సీకి తరలించి, అనంతరం మానుకోట ఆస్పత్రికి తీసుకెళ్లారు. కారు డ్రైవర్ భూక్య కిషన్ ను గుర్తించి, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్