మహబూబాబాద్ జిల్లా గూడురు మండలంలోని చక్రు తండాకు చెందిన లకావత్ ద్వాలి శుక్రవారం రాత్రి మిర్చి పంటకు కాపలాగా ఉండగా, అర్ధరాత్రి ఒంటిగంటకు శబ్దం విని లేచి చూసింది. ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో భయపడిన ఆమె తన మెడలోని పుస్తెలతాడు కనిపించలేదని గుర్తించి అరవడంతో దొంగలు పారిపోయినట్లు శనివారం తెలిపారు. దొంగిలించబడిన పుస్తెలతాడు బరువు రెండు తులాల 5 గ్రాములుగా ఉంది.