గూడూరు: వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలు మృతి

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానగరంలో గురువారం ఒక వృద్ధురాలు వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సూర్య ప్రకాష్ తెలిపారు. కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్