గూడూరు: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బొల్లెపల్లి గ్రామానికి చెందిన కడారి వీరస్వామి (42) అనే రైతు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తన 7 ఎకరాల భూమిలో పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు సాగు చేస్తున్న వీరస్వామి, పంట పెట్టుబడి కోసం మూడేళ్లుగా లక్షల్లో అప్పులు చేశారు. దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పులు తీర్చలేక శనివారం ఈ దారుణానికి పాల్పడ్డారు. స్థానికులు ఈ వివరాలను తెలిపారు.

సంబంధిత పోస్ట్