హనుమాన్ దేవాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయాలి

మహబూబాబాద్ పట్టణంలోని 28వ వార్డులో గల అతి పురాతనమైన హనుమంతుని గడ్డ హనుమాన్ దేవాలయాన్ని తక్షణమే దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకొని, ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహించాలని బీజేపీ పట్టణ ఇంచార్జ్ ఎల్ది మల్లయ్య గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం 28వ వార్డు ఇంచార్జ్ చుక్కల నరేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు హనుమంతుని గడ్డ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముల్లంగి ప్రతాపరెడ్డి, పెద్ద బోయిన రవి, దగ్గుల సురేష్, దీపక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕