మహబూబాబాద్ క్రీడాకారుడికి అంతర్జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లో జరిగిన లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320సీ – లెర్న్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ 2025–26 కార్యక్రమంలో మహబూబాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ బొడ్డుపల్లి ఉపేంద్రంకు స్పోర్ట్స్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్‌లోని ఆయన స్వగృహంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, ఉషోదయ వాకర్స్ జిల్లా అధ్యక్షులు పాలబిందెల మల్లయ్య, రఘు, రాజు, కార్తీక్, సయ్యద్ పాషా తదితరులు ఆయనను బుధవారం శాలువాతో సత్కరించి, పూల మొక్కను బహుకరించి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్