నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగు శివకోటి యాదవ్  ప్రకటించారు. ఆదివారం నర్సంపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నర్సంపేటలో పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్