కేసముద్రం :బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎంపీ

మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనపురం గ్రామంలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. దేవస్థాన కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆమెను సన్మానించారు.

సంబంధిత పోస్ట్