గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ లో కీమాన్ ఉద్యోగం చేస్తున్న రామకృష్ణారెడ్డి కేసముద్రంలో నివాసం ఉంటున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి అతని ఇంటికి వచ్చి డబ్బులు కట్టాలని గొడవ చేయగా మనస్తాపానికి గురైన రామకృష్ణారెడ్డి ఈరోజు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు అని ఎస్సై మురళిధర్ రాజ్ తెలిపారు.