కొత్తగూడ: ఎరువుల దుకాణ దారుల సంపూర్ణ బంద్

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఎరువుల సరఫరాలో అవకతవకలపై రాష్ట్ర అసోసియేషన్ పిలుపుతో ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణదారులు సోమవారం సంపూర్ణ బంద్ పాటించారు. యూరియా, డిఏపీ, ఫోటాష్, కాంప్లెక్స్ వంటి సబ్సిడీ ఎరువుల సరఫరాలో డీలర్లపై అదనపు రవాణాఛార్జీలు విధించడం వల్ల వారిపై అధిక భారం పడుతోందని, మార్జిన్ లేక రైతులపై కూడా భారం పెరుగుతోందని దుకాణదారులు తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం వారు ఈ బంద్ చేపట్టారు.

సంబంధిత పోస్ట్