మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలలో యదేచ్ఛగా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అడవుల్లోని టేకు చెట్లు నరికి ఒక చోట డంపు చేసుకొని టేకు కలప తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగంలో ఇంటి దొంగల పాత్ర ఉన్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా అటవీశాఖ అధికారులు చొరవ తీసుకుని అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేసి విలువైన అటవీ సంపద ను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.