మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు వినూత్న ప్రయోగం ఏరువాక సాగుబడి పేరుతో రైతుకు గుర్తింపు కార్డు అందజేస్తున్నామని ఆదివారం వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
రైతులకు చెందాల్సిన యూరియా పక్కదారి పట్టకుండా కేవలం రైతులకు అందే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వినూత్న ప్రయోగం చేపట్టారు. మొదటగా ఉమ్మడి కొత్తగూడ మండలంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.