మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కొత్తపల్లి గ్రామంలో అరుదైన, అంతరించిపోతున్న జాతికి చెందిన రెండు తలల పామును అక్రమంగా బంధించి ఉంచిన వ్యక్తిని అటవీ శాఖ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. మూఢనమ్మకాలతో భారీ ధరకు విక్రయించే ముఠాలు ఈ పాములను అక్రమ రవాణా చేస్తున్నాయని, ఆ కోణంలోనే ఈ వ్యక్తి పామును దాచి ఉంచాడని అధికారులు అనుమానిస్తున్నారు. అధికారులు పామును స్వాధీనం చేసుకున్నారు.