కురవి మండలంలోని సిద్ధార్థ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని ఎస్ఎఫ్ఐ నాయకులు గంధసిరి జ్యోతి బస్సు, పట్ల మధు గురువారం విమర్శించారు. బీఈడీ టీచర్లు లేకుండా పాఠాలు బోధించటం, టాయిలెట్‌ల లేమి, నాణ్యమైన భోజనం అందకపోవడం వంటివి తీవ్రమని పేర్కొన్నారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.