మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి సేవాసమితిలో గురుపౌర్ణమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7:30 గంటల నుండి 9.30 గంటల వరకు స్వామి వారికి నమక చమకాలతో అభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అనంతరం భక్తులకు మంగళ హారతి, తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 7: 30 గంటల నుండి భజన, తదుపరి హారతి కార్యక్రమం ఉంటుందని కన్వీనర్ శ్రీనివాస్ తెలిపారు.