మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ నామినేషన్ కేంద్రం వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పొత్తుల పేరుతో ఎమ్మెల్యే మురళీ నాయక్ తమను వంచించారని సీపీఐ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ తమ గొంతు కోసిందని, పొత్తు ధర్మాన్ని విస్మరించి అన్యాయం చేశారని వారు మండిపడ్డారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం వరకు వేచి చూసి, చివరికి తమకు అన్యాయం జరిగిందని సీపీఐ నాయకులు నిరసన తెలిపారు.