ఆత్మ కమిటీ చైర్మన్ గా ఇటీవల నియామకమైన సీపీఐ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డిని పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఘన సన్మానం చేసి అభినందనలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లో జరుగుతున్న పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఇటీవల మరిపెడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా కే నారాయణతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తదితరులు సుధాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.