మహబూబాబాద్ పట్టణంలోని 35వ వార్డులో శనివారం ఎమ్మెల్యే మురళీ నాయక్ రూ. 50 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని, సీఎం చొరవతో మానుకోటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.