మహబూబాబాద్ పట్టణానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమ కారుడు గుంజ హనుమంతు అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణంతో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు సంపంగి రామచంద్రు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలకుంట్ల శ్రీనివాస్, కుల సంఘ నాయకులు, తెలంగాణ ఉద్యమ కారులు JAC కన్వీనర్ డోలి సత్యనారాయణ, తదితరులు కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.