శనివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా, గూడూరులోని 30 పడకల దవాఖానను 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని అభ్యర్థిస్తూ వినతిపత్రం సమర్పించారు. మంత్రి దీనికి సానుకూలంగా స్పందించారు.