మహబుబాబాద్ జిల్లా వ్యాప్తంగా 200 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ మేళాను గురువారం ఘనంగా నిర్వహించినట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి మరియన్న తెలిపారు. ఆయన మాట్లాడుతూ రైతులకు ఆయిల్ పామ్ పంటల ద్వారా అధిక దిగుబడి పొందే అవకాశం ఉందన్నారు. వరి మొదలైన పంటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఆయిల్ పాం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా లాభాలు సంపాదించవచ్చని తెలిపారు.