మహబూబాబాద్ అంబేడ్కర్ సెంటర్ వద్ద, టియుసిఐ నాయకులు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ప్రతులను దగ్ధం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు సూర్యం మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ 1వ తేదీన అమలుకు పూనుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్స్ను అమలు చేయొద్దని డిమాండ్ చేశారు.